Latest Movie :

పార్టీ మారడం లేదన్న నాని-టిడిపికి రిలీఫ్

గుడివాడ తెలుగుదేశం శాసనసభ్యుడు కొడాలి నాని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు వెళ్లి పోతారన్న ప్రచారానికి తాత్కాలికంగా తెరపడింది.నాని చంచల్ గూడ జైలుకు వెళ్లి అక్కడ ఉన్న జగన్ ను పరామర్శించి,ఆ తర్వాత ఆయన పార్టీలోచేరే అవకాశం ఉందని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే నాని జగన్ ను కలవలేదు.టిదిపి అదినేత చంద్రబాబు తో కలిసి గంటపైగా చర్చించారు. జూనియర్ ఎన్.టి.ఆర్.కు సన్నిహితుడిగా ఉన్న కొడాలి నానిపై గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. అంతేకాక గుడివాడలో జగన్, నాని కలిసి ఉన్నట్లుగా ఫ్లెక్సీలు కూడా వెలిశాయని ప్రచారం జరిగింది.కారణం ఏమైనప్పట్టికీ నాని ఓ గంటపాటు చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత మనసు మార్చుకున్నారా? లేక తాత్కాలికంగా పార్టీని వీడరాదన్న అభిప్రాయానికి వచ్చారా అన్నది చూడాల్సి ఉంటుంది.రాజకీయాలలో ఒకసారి పార్టీ మారతారన్న ప్రచారం జరిగితే ఎక్కువ సందర్భాలలో అది ఏదో రూపంలో బయటపడుతూనే ఉంటుంది. ఆ అసంతృప్తి బహిర్గతం అవుతూనే ఉంటుంది. కృష్ణా టిడిపిలో ఏర్పడిన వర్గ రాజకీయాలు కూడా ఈ వివాదానికి దారి తీశాయి. ఏది ఏమైనా నాని ప్రస్తుతం పార్టీ మారబోవడం లేదని చెప్పడం టిడిపికి రిలీఫ్ గా చెప్పవచ్చు.
తగ్స్:పార్టీ మారడం లేదన్న నాని-టిడిపికి రిలీఫ్
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. Tollywoodz - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger